లేఆఫ్‌ల బాటలో తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా చేరింది. ఈ క్రమంలో దేశంలోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న 453 మందిని గురువారం అర్థరాత్రి నుంచి తొలగించినట్లు తెలిసింది. తొలగించబడిన Google ఉద్యోగులకు అధికారిక మెయిల్‌లో CEO సుందర్ పిచాయ్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter)ను సొంతం చేసుకున్నప్పటి నుండి ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు, అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్ ను సొంతం చేసుకోవడానికి ముందు కూడా నాటి యాజమాన్యంతో వివాదానికి తెర లేపాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జన్మదినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) అద్భుత కానుక అందించింది. తాను కలలుగన్న ప్రాజెక్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టు నిర్మాణంపై వేసిన కేసులపై విచారించిన ధర్మాసనం ప్రాజెక్టు పనులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పెద్ద ఎత్తున నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్యా దేశీయ మార్కెట్లు కూడా దిగువకు పయనిస్తున్నాయి. దీంతో ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 400, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 120కిపైగా, బ్యాంక్ నిఫ్టీ 710 పాయింట్లు కోల్పోయాయి.
కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ మొత్తం కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగాయి. ఆస్పత్రుల్లో రోగులు, వారి బంధువులకు పండ్లు పంపిణీ చేపట్టారు. కొన్ని చోట్ల పేదలకు అన్నదానం చేశారు. కొంత మంది రక్తదానం చేశారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున సాయంత్రం పెద్ద ఎత్తున జన్మదినోత్సవ కార్యక్రమం చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్...
తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీల అంశంపై కేంద్ర కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అబద్ధాలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రధాని మోదీ తమ మంత్రులకు ఒకే అబద్ధం చెప్పే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
తన నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు.
MP Santhosh : సీఎం కేసీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా... ఆయనకు ఎంపీ సంతోష్ అరుదైన బహుమతి ఇచ్చారు.
హైదరాబాద్ లో గత ఏడాది దసరా పండుగ సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఘటనను పోలీసులు చేధించారు. ఆ క్రమంలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తి మహ్మద్ అబ్దుల్ కలీమ్ సీట్, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) అధిక రిటర్న్స్ అందించే సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (Investment Scheme) అమృత్ కలష్ డిపాజిట్ పథకాన్ని (Amrit Kalash Deposit) లాంచ్ చేసింది.
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.
వారానికి ఆరు రోజులు పని.. ఒక్క రోజు విరామం.. అత్తెసరు జీతం. సెలవుకు తిప్పలు పడాల్సిన పరిస్థితి. ఇవన్నీ మాకు కుదరని తమ ప్రతిభకు పదును పెట్టి వ్యాపార రంగంలోకి దూకుతున్నారు. తమ ప్రతిభకు తోడు సాంకేతిక పరిజ్ణానాన్ని వినియోగించి యువత సత్తా చాటుతోంది. ఉద్యోగం చేయడం కాదు తామే నలుగురికి ఉద్యోగమిచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. ఏమాత్రం నామోషీ పడకుండా కింద స్థాయి నుంచే కష్ట పడుతున్నారు. విజయం కోసం ఎన్నాళ్లయిన...
Governor Tamilsai : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. కాగా... అలా శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో... గవర్నర్ తమిళిసై కూడా ఉండటం విశేషం.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న వారు కొంతమంది గాయపడ్డారు. ఓ ట్రావెల్స్ బస్సు 38 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద లారీని ఢీకొట్టింది.