లేఆఫ్‌ల బాటలో తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా చేరింది. ఈ క్రమంలో దేశంలోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న 453 మందిని గురువారం అర్థరాత్రి నుంచి తొలగించినట్లు తెలిసింది. తొలగించబడిన Google ఉద్యోగులకు అధికారిక మెయిల్లో CEO సుందర్ పిచాయ్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది
లేఆఫ్‌ల(layoffs) బాటలో తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్(google) కూడా చేరింది. ఈ క్రమంలో దేశంలోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న 453 మందిని గురువారం అర్థరాత్రి నుంచి తొలగించినట్లు తెలిసింది. తొలగించబడిన Google ఉద్యోగులకు అధికారిక మెయిల్లో CEO సుందర్ పిచాయ్(sundar pichai) నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గురువారం అర్థరాత్రి వారికి ఆ సమాచారం వచ్చినట్లు తెలిసింది.
ఈ క్రమంలో ఉద్యోగులకు గూగుల్ ఇండియా కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఈ మెయిల్ పంపారని మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. గూగుల్(google) సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను లేదా 6 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆల్ఫాబెట్ ఇంక్(alphabet inc) ఇప్పటికే గత నెలలో ప్రకటించింది. ఈ క్రమంలో 453 మంది ఉద్యోగులను తొలగించిన అంశంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
జనవరిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పంపిన నోట్లో, యుఎస్ వెలుపల తొలగించబడిన గూగుల్ ఉద్యోగులకు స్థానిక పద్ధతులకు అనుగుణంగా మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు? మరోవైపు ఈ టెక్ దిగ్గజంలో మరిన్ని తొలగింపులు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.
లేఆఫ్‌లను ఆశ్రయిస్తున్న కంపెనీలలో గూగుల్ ఒక్కటే కాదు. ఈ కామర్స్ సంస్థ అమెజాన్(amazon) కూడా తన వర్క్‌ఫోర్స్ నుంచి 18,000 మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మెటా(meta) 13,000 మంది ఉద్యోగులను తొలగించింది. మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ కూడా తొలగింపులకు పూర్తి బాధ్యత వహించారు. కరోనా మహమ్మారి దశలో అంతకు ముందు నియామకాలతో కంపెనీ చాలా నష్టపోయినట్లు గతంలో పేర్కొన్నారు.