»Elon Musk Shuts Two Of Three Twitter India Offices
Twitter India: భారత్లో 2 ఆఫీస్ల మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ (Twitter)ను సొంతం చేసుకున్నప్పటి నుండి ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు, అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్ ను సొంతం చేసుకోవడానికి ముందు కూడా నాటి యాజమాన్యంతో వివాదానికి తెర లేపాడు.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ (Twitter)ను సొంతం చేసుకున్నప్పటి నుండి ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు, అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్ ను సొంతం చేసుకోవడానికి ముందు కూడా నాటి యాజమాన్యంతో వివాదానికి తెర లేపాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్ తో పాటు పలువురిని తొలగించాడు. రెండు రోజుల క్రితం ట్విట్టర్ సీఈవో అంటూ తన పెంపుడు కుక్కను (Pet Dog) ట్విట్టర్ సీఈవో కుర్చీ పైన కూర్చోబెట్టాడు. అంతేకాదు, గత సీఈవో కంటే ఇది బాగా పని చేస్తుందంటూ వివాదానికి తెర లేపాడు. తాజాగా ఆర్థిక నష్టాల్లో ఉన్న ట్విట్టర్ ను గట్టెక్కించడం పై దృష్టి సారించాడు. ఇందులో భాగంగా భారత్ లో ఉన్న మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసి వేయనున్నట్లుగా తెలుస్తోంది. ట్విట్టర్ కు దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ నగరం బెంగళూరులలో కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో బెంగళూరు మినహా మిగతా రెండు నగరాల్లోని కార్యాలయాలను క్లోజ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హోమ్ చేయాలని సూచించినట్లుగా సమాచారం. బెంగళూరు నుండే ఎక్కువ మంది టెక్కీలు పని చేస్తున్నారు. కాబట్టి అక్కడి కార్యాలయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది అక్టోబర్ లో మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు. నాటి నుండి ఆదాయం మాత్రం పడిపోతోంది. ప్రధానంగా వాణిజ్య ప్రకటనలు తగ్గిపోయాయి. ఈ ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు కార్యాలయాలు క్లోజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించారు. ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ప్రారంభించారు. ఉద్యోగులకు సౌకర్యాలను కూడా కుదించారు.