MP Santhosh : సీఎం కేసీఆర్ కి ఎంపీ సంతోష్ సూపర్ బర్త్ డే గిఫ్ట్…!
MP Santhosh : సీఎం కేసీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా... ఆయనకు ఎంపీ సంతోష్ అరుదైన బహుమతి ఇచ్చారు.
సీఎం కేసీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా… ఆయనకు ఎంపీ సంతోష్ అరుదైన బహుమతి ఇచ్చారు.
గతంలో కేసీఆర్ పుట్టినరోజు కు ఎంపీ సంతోష్ కుమార్ కోటి వృక్షర్చన అని పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమం సక్సెస్ ఫుల్ అయింది. తాజాగా నేడు బర్త్ డే జరుపుకుంటున్న కేసీఆర్ కు ఓ గిఫ్ట్ అందించారు.
కేసీఆర్ తలపెట్టిన కొండగట్టు ఆలయ పునర్ నిర్మాణ ప్రక్రియలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం.. వెయ్యు ఎకరాలకుపైగా అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్టు సంతోష్ కుమార్ ప్రకటించారు. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునఃనిర్మించాలని కేసీఆర్ ఈ మధ్య పర్యటనలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు నమ్మినబంటైన ఎంపీ సంతోష్ కుమార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయానికి మద్దతుగా.. కోట్లాది మంది ఆంజనేయ భక్తులకు బాసటగా కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉండే వెయ్యి ఎకరాల అభయారణ్యం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున దత్తత తీసుకోవాలని సంతోష్ కుమార్ నిర్ణయించారు. పచ్చని ప్రకృతిలో భక్తులు సేద తీరేలా పరిసరాలను తీర్చిదిద్దుతాని, మట్టితో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు.