»Ntr Birthday Special See What His Fans Did For Ntr Craze
Jr.NTR : జూ. ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్.. తారక్ కటౌట్ కి మేకపోతు బలి
ఫ్యాన్స్ కు వారు అభిమానించే తారలే దేవుళ్లు. వారి కోసం ఏమైనా చేస్తారు. ఈ మధ్యకాలంలో కొందరు అభిమానం పేరిట పిచ్చి పనులు చేస్తున్నారు. అవి మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jr.NTR : ఫ్యాన్స్ కు వారు అభిమానించే తారలే దేవుళ్లు(Gods). వారి కోసం ఏమైనా చేస్తారు. ఈ మధ్యకాలంలో కొందరు అభిమానం పేరిట పిచ్చి పనులు చేస్తున్నారు. అవి మీడియా(Media)లో వైరల్(Viral) అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ స్టేటస్ ఉన్న హీరోల ఫ్యాన్స్ కొందరు అభిమానం పేరిట హద్దులు మీరుతున్నారు. తమ హీరోని విష్ చేయకపోయినా బూతులు తిడుతున్నారు.. తమ హీరోతో సినిమాకు రిజెక్ట్ చేస్తే ఆ హీరోయిన్(Heroine) ని సోషల్ మీడియా(Social media)లో ఏకీపారేస్తున్నారు.. మరి కొందరు ఏకంగా తమ హీరో సినిమా ఫ్లాప్ అయ్యి..పక్క చిన్న హీరో సినిమా హిట్ అయితే నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జర హద్దు దాటారు. తారక్ పుట్టినరోజు సందర్బంగా ఆయన కటౌట్ కు ఏకంగా మేకపోతు బలి ఇచ్చేశారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రచ్చ చేశారు . తారక్ పుట్టినరోజు సందర్భంగా మచిలీపట్నంలోని జీ3 థియేటర్లో సింహాద్రి సినిమాను ప్రదర్శించారు . సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు . అయితే ఈ క్రమంలోనే కొందరు ఫాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ కు రెండు మేకపోతులను బలి ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు . అంతేకాదు మధ్యాహ్నం పేదలకు అన్నదానం నిర్వహించారు . అంతేనా జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు . అయితే కొంతమంది జనాలు మాత్రం ఈ మేకపోతుల బలిని యాక్సెప్ట్ చేయడం లేదు .