న్యూజిలాండ్ ప్రధాని పదవీకి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. వచ్చే నెల 7వ తేదీ తర్వాత పదవీ నుంచి తప్పుకుంటారు. అధికార లేబర్ పార్టీ సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. లేబర్ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22వ తేదీన ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన సాధారణ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తోందని వెల్లడించారు. 2017లో జెసిండా ఆర్డెర్న్ తొలిసారిగా న్యూజిలాండ్ ప్రధానిగా గెలుపొందారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
మూడేళ్ల తర్వాత, 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీకి ఆదరణ లభించలేదు. 120 సీట్లలో 49 శాతం ఓట్లతో 64 స్థానాల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. దేశంలో కోవిడ్‌ను సరిగా కట్టడి చేయకపోవడం, ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల్లో జెసిండా నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. దీంతో జెసిండా ఇమేజ్ కూడా దెబ్బతింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓడిపోయింది. మరింతకాలం ప్రధాని పదవీలో కొనసాగలేనని జెసిండా ప్రకటించారు.
ఐదున్నరేళ్ల కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని జెసిండా పేర్కొన్నారు. కష్ట కాలాన్ని ఫేస్ చేశానని, తాను కూడా మనిషినేనని వివరించారు. రాజకీయ నేతలు కూడా వ్యక్తులేనని పేర్కొన్నారు. జెసిండా వారసుడిపై చర్చ జరుగుతుంది. ఇంతలో న్యూజిలాండ్ డిప్యూటీ పీఎం, ఆర్థికమంత్రి గ్రాంట్ రాబర్ట్ సన్ స్పందించారు. లేబర్ పార్టీ అధినేతగా తాను బరిలోకి దిగనని స్పష్టంచేశారు.