తెలంగాణ మంత్రి హరీష్ రావు కి సీఎం కేసీఆర్ కొత్త బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. తమ పార్టీ బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల్లో విస్తరింపచేయాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే… ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే… ఈ సభకు సబంధించిన ఏర్పాట్లు బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఖమ్మంలో బీఆర్ఎస్ సమావేశం రోజునే… కొందరు బలమైన నేతలు ఆ పార్టీని వీడబోతున్నారు. ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్దమౌతున్న తరుణంలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు కారు సిద్దమైంది. ఖమ్మం జిల్లాలో పట్టు సాధించే బాధ్యతలను ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్‌రావుకు అప్పగించింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, జిల్లాలో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని హరీష్ రావుకు సూచించారు సీఎం కేసీఆర్.
2018వ సంవత్సరంలోనూ బలమైన నేతలను ఓడించే బాధ్యతలను మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. ఆ బాధ్యతలను హరీష్‌రావు సక్రమంగా నిర్వహించడంతో మరోసారి ఆయనకే ఇలాంటి కష్టతరమైన బాధ్యతలను అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పార్టీని వీడేవారిని బుజ్జగించి పదవులు, సీట్లు ఇచ్చే విధంగా హమీలు ఇచ్చేందుకు పార్టీ నేతలు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.