Taraka Ratna: పొలిటికల్ ఎంట్రీతో.. భర్త కలను నెరవేర్చనున్న తారకరత్న భార్య
చిన్న వయసులోనే గుండెపోటుతో అకస్మాత్తుగా తనువు చాలించారు తారకరత్న. తాత ఆశయాలకు అనుగుణంగా రాజకీయ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేద్దాం అనుకునే లోపే విధి తనతో ఆడుకుంది.
Taraka Ratna: చిన్న వయసులోనే గుండెపోటుతో అకస్మాత్తుగా తనువు చాలించారు తారకరత్న(Taraka Ratna). తాత(NTR) ఆశయాలకు అనుగుణంగా రాజకీయ ప్రవేశం(Political entry) చేసి ప్రజలకు సేవ చేద్దాం అనుకునే లోపే విధి తనతో ఆడుకుంది. నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర ప్రారంభం రోజే.. తారకరత్న గుండెపోటు(heart attack)కు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆసుపత్రి(Hospital)లో చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచారు. దీంతో రాజకీయాల్లో పూర్తి స్థాయి అడుగులు వేయడానికి ముందే ఆయన కన్నుమూశారు. వచ్చే ఎన్నికల్లో తారకరత్న ఎమ్మెల్యే(MLA)గానో, ఎంపీ(MP)గానే పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అనుకున్నదేదీ జరుగలేదు.
ఐతే తారకరత్న కోరికను నిజం చేసేందుకు ఆయన భార్య అలేఖ్యా రెడ్డి(Alekhya Reddy) సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భర్త కలలు, ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి దిగాలని అలేఖ్యారెడ్డి నిర్ణయించుకున్నారనే ప్రచారం సాగుతోంది. తన భర్త తారకరత్న జీవించి ఉన్న సమయంలో గుడివాడ(gudiwada) నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపించేవారు. ఐతే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని(kodali nani)కి చెక్ పెట్టేందుకు ఎన్టీఆర్ కుటుంబం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపితే బాగుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrabau) ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. దీంతో తారకరత్నకు అవకాశం ఇస్తారంటూ ప్రచారం భారీగా జరిగింది.
కానీ తారకరత్న కాలం చేసిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. గుడివాడలో టీడీపీ ఇన్ చార్జిగా రావి వెంకటేశ్వరరావు(Ravi Venkateswara Rao) పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఎన్ఆర్ఐ రాము(NRI Ramu) కూడా.. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే దాదాపు నియోజకవర్గం ఒకటి రెండు సార్లు చుట్టి వచ్చారు. గుడివాడ చుట్టూ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో భర్త ఆశయ సాధనకు అలేఖ్యారెడ్డి రంగంలోకి దిగి గుడివాడ టికెట్ కోరితే పరిస్థితి ఏంటన్న ఆలోచనే.. టీడీపీ శ్రేణుల్ని అయోమయంలో పడేసింది. అసలు అలేఖ్యారెడ్డి నిజంగా రాజకీయాల్లోకి వస్తారా.. లేదా అనేది కొంత కాలం తర్వాత తెలుస్తుంది.