»Mukesh Goud Memorial Mallayuddha Competitions Concluded
Wrestling : ముగిసిన ముఖేశ్ గౌడ్ స్మారక ‘మల్లయుద్ధ పోటీలు
ముఖేశ్ గౌడ్ స్మారక 'మల్లయుద్ధ' (Mallayud'dha)'రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు ఘనంగా ముగిశాయి. ( LB Stadium)ఎల్బీ స్టేడియంలో నాలుగురోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగినయి.బాలకేసరి, పురుషుల, మహిళల విభాగాల్లో ఓవరాల్‌గా 17 కేటగిరీల పోటీలు నిర్వహించారు.
ముఖేశ్ గౌడ్ స్మారక ‘మల్లయుద్ధ’ (Mallayud’dha)’రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు ఘనంగా ముగిశాయి. ( LB Stadium)ఎల్బీ స్టేడియంలో నాలుగురోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగినయి.బాలకేసరి, పురుషుల, మహిళల విభాగాల్లో ఓవరాల్‌గా 17 కేటగిరీల పోటీలు నిర్వహించారు. మహిళల ఓపెన్ విభాగంలో రోహిణి సత్య శివాని పసిడి పతకం సాధించగా.. నేహా, రుహినా భాను రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. బాలకేసరి విభాగంలో షేక్ అజీం( Gold medal) బంగారు పతకం గెల్చుకోగా.. పర్వేజ్, పవన్‌లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.పురుషుల విభాగంలో భగీరత్ సింగ్ (38 కేజీలు), రవి భారత్ (42 కేజీలు), కె.ఎస్ కిషన్ (48 కేజీలు), మహ్మద్ అబ్దుల్ (52 కేజీలు), లవకుశ గౌడ్ (53 కేజీలు), డి. వినోద్ (57 కేజీలు), అరవింద్ కుమార్ (61 కేజీలు), సయ్యద్ అబ్దుల్లా (65 కేజీలు), మహేంద్ర కుమార్ (70 కేజీలు)లు తమ కేటగిరిల్లో బంగారు పతకాలు సాధించారు.
ప్రతి విభాగంలో బంగారు పతకం సాధించిన రెజ్లర్‌కు రూ.1 లక్ష, రజత పతకానికి రూ.50 వేలు, కాంస్య పతకానికి రూ.25 వేల నగదు బహుమతులు అందజేశారు. మహిళల ఓపెన్ విభాగం ఫైనల్స్, బహుమతుల ప్రధానోత్సవానికి మాజీ మంత్రి( Etala Rajender)ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రేష్ఠ్ ఫౌండేషన్( Shrestha Foundation) వ్యవస్థాపకులు, బీజేపీ నాయకుడు విక్రమ్ గౌడ్(Vikram Goud)తో కలిసి విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన ముఖేశ్ గౌడ్ స్మారకార్థం భారీ స్థాయిలో రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించిన.. విక్ర్రమ్ గౌడ్‌ను ఈటల రాజేందర్ అభినందించారు. మల్లయుద్ధ చాంపియన్‌షిప్ పోటీల్లో తలపడిన 700 మంది రెజ్లర్ల నుంచి.. ప్రతి విభాగంలో ఓ ఉత్తమ రెజ్లర్‌ను(best wrestler) ఎంపిక చేసి జాతీయ, (International) అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన (Financial support)ఆర్థిక సహకారం అందించనునన్నారు. రూ.5 లక్షలను ఉపకార వేతనాల రూపంలో ఏడాది పాటు ఇవ్వనున్నట్టు విక్రమ్ గౌడ్ ప్రకటించారు.
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ (K Laxman)కె లక్ష్మణ్ శనివారం( Wrestling )కుస్తీ పోటీల సెమీఫైనల్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలన్నారు. అప్పుడే క్రీడా భారత్ సాధ్యపడుతుందన్నారు. (Mukesh Goud) స్మారకార్థం రూ.35 లక్షల నగదు బహుమతితో (Wrestling ) రెజ్లింగ్ పోటీలు నిర్వహించటం సంతోషమన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న శ్రేష్ఠ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విక్రమ్ గౌడ్‌కు ఆయన అభినందనలు తెలిపారు.మూడు రోజుల పాటు సాగుతున్న మల్లయుద్ధ పోటీల్లో ఆదివారం అన్ని విభాగాల్లో ఫైనల్స్ జరుగనున్నాయి. పురుషుల 55 కేజీలు, 60 కేజీలు, 66 కేజీలు, 74 కేజీలు, 87 కేజీలు సహా 100 కేజీలు, 120 కేజీల విభాగాల్లో పోటీలు శనివారం ఆకట్టుకున్నాయి. 17 విభాగాల్లో 700 మంది రెజ్లర్లు పోటీపడుతున్న మల్లయుద్ధ చాంపియన్‌షిప్స్‌లో మహిళలకు సైతం ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నారు.