Goshamahal seat is mine, Rajasingh will also be asked for vote.. Vikram Goud
BJP: గోషామహల్(Goshamahal) అసెంబ్లీ నియోజకవర్గంలో గతకొంతకాలంగా రాజకీయం వేడికెక్కిన విషయం తెలిసిందే. దీనిక కారణం అక్కడి ఎమ్మెల్యే(MLA) సీటు విషయంలో ఇద్దరు బీజేపీ(BJP) నాయకులు పోటీపడుతున్నారు. ఈ విషయంలో స్థానిక ప్రజల్లో కూడా అసలు ఎవరు బరిలో ఉంటారు అనే అనుమానాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌ను బీజేపీ కొద్ది నెలల క్రితం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ రాజాసింగ్(Raja Singh)పై విధించిన సస్పెన్షన్‌ను తొలగించడంపై కూడా పలు అనుమానాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో అయితే గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి, దివంగత ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్(Vikram Goud)ను పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంటోంది.
ఈ క్రమంలో శుక్రవారం బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్(Etala Rajender), విక్రమ్ గౌడ్‌తో సమావేశమై స్థానికంగా నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ గోషామహల్ సీటు తనదే అని రాబోవు ఎన్నికల్లో ఇక్కడినుంచే పోటీ చేస్తానని చెప్పారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఆయన మద్ధతు కూడా అడుగుతానని తెలిపారు. తమ కుటుంబానికి గోషామహల్ కు విడదీయారాని సంబంధం ఉన్నట్లు కచ్చితంగా ప్రజలు తనను ఆశీర్వాదిస్తారని పేర్కొన్నారు. అయితే రాజాసింగ్ సేవలు పార్టీకి అవసరమన్నారు. సస్పెన్షన్ విషయం అధిష్టానానికి చర్యాలు తీసుకుంటుందన్నారు.
రాజాసింగ్ సస్పెన్షన్‌పై జాప్యానికి ప్రధాన కారణం గోషామహల్ స్థానాన్ని ఖాళీ చేయకపోవడమేనని వార్తలు వినిపిస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాజాసింగ్‌కు బీజేపీ అధిష్టానం అల్టిమేటం జారీ చేసినప్పటికీ ఆయన ఒప్పుకోవడం లేదని సమాచారం. గోషామహల్ నుంచి పోటీ చేస్తానని, ఇక్కడ్నుంచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే గోషామహల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్‌కు మంచి పట్టుంది. మద్దతుదారులు కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికి వెళ్లొద్దని ఆయనకు సూచించినట్లు సమాచారం.