Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చెంగిచెరర్లలో బాధితులను పరామర్శించడానికి బయలుదేరిన ఆయనకు అనుమతి లేదంటూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చెంగిచెర్ల బాధితులను పరామర్శించడానికి గురువారం సాయంత్రం వెళతానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన అక్కడికి వెళితే ఇరు వర్గాలకు మంచిది కాదని భావించిన పోలీసలు అధికారులు రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. హోలీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందులు రాముడి పాటలు పెట్టుకొని ఉండగా అక్కడే ఉన్న కొందరు ముస్లింలు అడ్డుచెప్పారు అని, దాంతో ఇరు వర్గాల నడుమ గొడవ జరిగిందని సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అక్కడికి బండి సంజయ్ కూడా వెళ్లి అక్కడ ఉన్న హిందువులను పరామర్శించారు.
రాజాసింగ్ పర్యటనను అడ్డుకున్నారు అని, ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడికి గురైన వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడం కూడా తప్ప, ఇలా తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటి అని పోలీసు అధికారులను నిలదీశారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి నిర్భందాలు తప్పలేదు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా జరుగుతున్నాయి అని, హిందువులపై దాడి జరగడం దారుణం అని మండిపడ్డారు. ఇలాంటి దాడులను ఇకపై సహించేది లేదన్నారు. హిందువులపై పెట్టిన అక్రమ కేసులు కొట్టేయలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు తాము పోరాడుతామని అన్నారు.