బలవంతంగా ముద్దు పెట్టాలని చూసిన భర్త నాలుకను భార్య కొరికేసిన ఘటన కర్నూలు జిల్లా(Kurnool District)లో జరిగింది. తారాచంద్ నాయక్, పుష్పవతి 2015లో లవ్ మ్యారేజ్ (Love marriage)చేసుకోగా ఇద్దరు పిల్లలున్నారు. ఇవాళ భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగగా.. భర్త నాలుకను భార్య కొరికేసింది. తీవ్రంగా గాయపడ్డ తారాచందు అనంతపురం(Anantapur) ఆస్పత్రికి తరలించారు. తనపై దాడి చేసి, బలవంతంగా ముద్దు పెట్టాలని చూసినందుకే అలా చేశానని భార్య పుష్పవతి పోలీసులకు తెలిపారు.శుక్రవారం ఉదయం కూడా ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బలవంతంగా ముద్దు పెట్టేందుకు యత్నించిన భర్త నాలుకను గట్టిగా కొరికేసింది భార్య. తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న బాధితుడిని.. స్థానికులు చికిత్స నిమిత్తం గుత్తి ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతరం ఆస్పత్రికి తరలించారు.