Mla Raja Singh Praises Minister Talasani Srinivas Yadav
Mla Raja Singh:ఎమ్మెల్యే రాజా సింగ్ (Mla Raja Singh) రాజకీయ పయనంపై చర్చ జరుగుతోంది. సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తి వేయలేదు. అతను టీడీపీలో చేరతారనే ప్రచారం జరగగా.. రాజా సింగ్ ఖండించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ గురించి పోటీ చేస్తారో తెలియరాలేదు. ఇంతలో రాజా సింగ్ (Raja Singh) స్టాండ్ మార్చేశారు. అధికార పార్టీ ముఖ్య నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను (talasani srinivas yadav) పొగడ్తలతో ముంచెత్తారు.
ఇప్పటి పరిస్థితి ఇలా ఉంది.. అంతకుముందు ఉప్పు- నిప్పులా ఉండేవారు. అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసేవారు. అసెంబ్లీలో కూడా ప్రభుత్వ తప్పిదాలను రాజా సింగ్ (Raja Singh) ఎత్తిచూపేవారు. మారిన పరిస్థితుల్లో.. రాజా సింగ్‌లో మార్పు ఊహించిందేనని మేధావులు అంటున్నారు.
గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని (talasani), హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. వారితో కలిసి రాజా సింగ్ (Raja Singh) రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి తలసాని బాగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో కొంత ఆలస్యం అయ్యిందని పేర్కొన్నారు. ఇప్పడు ఇచ్చారని.. సంతోషంగా ఉందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తెలంగాణ ప్రభుత్వం కలిసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. మరికొందరు అడుగుతున్నారని.. వారికి ఇళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజా సింగ్ గుర్తుచేశారు.
ఒక్కసారిగా మంత్రి తలిసానిపై రాజా సింగ్ (Raja Singh) ప్రశంసలు కురిపించడం అంటే.. మర్మం ఏదో దాగుందనే గుసగసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీలో చేరబోతున్నారా అనే సందేహాం కలుగుతుంది. అందుకోసమే తలసానిపై పొగడ్తలు కురిపించారా అని డౌట్ వస్తోంది. ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేకపోవడం.. సస్పెన్షన్ గురించి బీజేపీ తేల్చకపోవడంతో ప్రత్యామ్నాయంపై రాజా సింగ్ ఆలోచించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.