Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ దందా వెనక ఎవరు ఉన్నారో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ముందే ఇక్కడ కుంభకోణం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్‌కు ఖరీదైన లేబుల్స్ వేసి విక్రయిస్తున్నారని బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఈ అంశంపై విచారించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. లేదంటే లిక్కర్ స్కామ్ జరిగినట్టు లెక్క అని తేల్చిచెప్పారు. ఇక్కడ కూడా కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించడం.. అమలు చేయడం అందులో భాగమేనా అనే సందేహాం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత (kavitha) తప్పు చేస్తే శిక్ష తప్పదని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కవిత (kavitha) హస్తం ఉందని సీఎం కేసీఆర్ (kcr), మంత్రి కేటీఆర్‌కు (ktr) తెలుసని చెప్పారు. అందుకోసమే వారు మాట్లాడటం లేదని తెలిపారు. అవినీతిని బీజేపీ సహించదని బండి సంజయ్ (Bandi Sanjay) తేల్చిచెప్పారు. ప్రధాని మోడీ (modi) పాలనలో అవినీతికి ఆస్కారం లేదని స్పష్టంచేశారు. తెలంగాణలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇంతకుముందు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫారిన్ లిక్కర్ పాలసీ గురించి ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మాత్రం.. ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ (ed), సీబీఐ (cbi) విచారణ కంటిన్యూ అవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ పలుమూర్లు ప్రశ్నించింది. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉంటే.. దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందులో తమ ప్రమేయం ఏమీ లేదని అంటున్నారు.