Jee Karda: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో నటించలేదు. కానీ తాజాగా బాలీవుడ్ లో ఓ లవ్ మేకింగ్ స్టోరీలో బోల్డ్ గా నటించి అందరికి షాక్ ఇచ్చింది. Jee Karda అరుణియా శర్మ , హుమీ ఆదా జామియా తెరకెక్కించిన వెబ్ సిరీస్. నిన్నటి నుంచి ఈ సిరీస్ ట్రిమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనే దానికంటే ఎలా ఉండబోతోంది అనే విషయమే అందరిని ఆసక్తి పరిచెలా చేసింది. ఇందులో తమన్నా హాట్ షో చేయడమే కారణమని చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో తమన్నా కూడా పలు విమర్శలను ఎదుర్కొంది.
Jee Karda సిరీస్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. అయితే ఆమె బోల్డ్‌గా నటించడంపై పలు విమర్శలు రావడంతో వీటిపై స్పందించారు. ఈ సిరీస్‌పై వస్తున్న విమర్శల గురించి బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన తమన్నా, ఈ సిరీస్‌లో నటించడంలో తప్పు లేదని, కథకు అలాంటి సన్నివేశాలు ఖచ్చితంగా అవసరమని అనిపించిందని ఘాటైన సమాధానం ఇచ్చింది. రిలేషన్ షిప్ ను రియాలిటీగా చూపించడంలో ఇలాంటి సీన్లు చాలా కీలకమని.. ఎవరు విమర్శించినా జనాలకు నచ్చడం వల్లే అలాంటి సన్నివేశాల్లో నటించానని చెప్పింది. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.