»Ipl 1000th Match Today Between Mi Vs Rr Know History Of First 100th And 500th Match
IPL 1000th Match : ఏప్రిల్ 30, 2023 IPLకి చాలా ప్రత్యేకమైన రోజు.. ఎందుకో తెలుసా?
నేడు(30 ఏప్రిల్ 2023) IPLకి చాలా ప్రత్యేకమైన రోజు. దీనికి కారణం ఈ రోజున 1000వ మ్యాచ్ జరగనుంది. దానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడం. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంఖడే మైదానంలో ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ జరగనుంది.
IPL 1000th Match : నేడు(30 ఏప్రిల్ 2023) IPLకి చాలా ప్రత్యేకమైన రోజు. దీనికి కారణం ఈ రోజున 1000వ మ్యాచ్ జరగనుంది. దానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడం. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వాంఖడే మైదానంలో ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద T20 లీగ్‌లో మొదటి, 100వ, 500వ మ్యాచ్‌ల చరిత్రను పరిశీలిద్దాం.
IPL మొదటి మ్యాచ్, RCB vs KKR
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. 18 ఏప్రిల్ 2008 సాయంత్రం బెంగళూరులో ఆడిన ఈ మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో RCBపై KKR బంపర్ విక్టరీ సాధించింది.
మెకల్లమ్ 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 158 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. తర్వా త బ్యాటింగ్ కు దిగిన RCB 82 పరుగులకే ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ జట్టు 140 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో మెకల్లమ్ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
IPL 100వ మ్యాచ్, KKR vs RCB
ఐపీఎల్ ప్రారంభమైన రెండేళ్ల తర్వాత అనగా IPL మూడో సీజన్లో 100వ మ్యాచ్ జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ మ్యాచ్ జరిగింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా అప్పట్లో ఐపీఎల్ 100వ మ్యాచ్ ఆఫ్రికాలోని సెంచూరియన్ మైదానంలో జరిగింది.
బ్రెండన్ మెకల్లమ్ తన 100వ మ్యాచ్‌లో కూడా KKR జట్టు తరఫున కీలక పాత్ర పోషించాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. ఫలితంగా కెకెఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కానీ, ఈసారి రాస్ టేలర్ అద్భుతంగా ఆడడంతో RCB 6 వికెట్ల తేడాతో KKR ను ఓడించింది. టేలర్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేయడంతో RCB 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.
ఐపీఎల్ 500వ మ్యాచ్
మే 3, 2015 తేదీన IPL 9వ సీజన్లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఐపీఎల్ 500వ మ్యాచ్ నిర్వహించారు. ఆ మ్యాచ్ ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆటగాడు అజింక్య రహానే ఢిల్లీ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. చారిత్రాత్మక 500వ మ్యాచ్‌లో 54 బంతుల్లో 91 పరుగులు చేశాడు. దీంతో పాటు రాజస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది మరియు 14 పరుగుల తేడాతో ఓడిపోయింది.
IPL 1000వ మ్యాచ్: MI vs RR
ఐపీఎల్ చరిత్రలో 500వ మ్యాచ్‌లో భాగమైన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు 1000వ మ్యాచ్‌ను కూడా ఆడనుంది. ముంబై ఇండియన్స్‌తో పోటీ పడుతోంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్ కోసం బీసీసీఐ కూడా ప్రత్యేక సన్నాహాలు చేసింది. మీడియా సమాచారం ప్రకారం, మ్యాచ్‌కు ముందు 10-15 నిమిషాల ప్రత్యేక ప్రోగ్రామ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.