»In Karnataka Assembly Electionscongress Mla Won Without Campaigning
Karnataka Assembly Elections : గెలుపంటే ఇదే.. ప్రచారం లేకుండానే ఎమ్మెల్యే అయ్యాడు
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పార్టీని చిత్తుగా ఓడింది. కాంగ్రెస్ విజయ హస్తం ఎగురవేసింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు కూడా తారుమారు చేస్తూ కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. మొత్తం 136స్థానాల్లో గెలిచి అధికారం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్జీని సాధించింది.
Karnataka Assembly Elections : కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పార్టీ(BJP) చిత్తుగా ఓడింది. కాంగ్రెస్ (Congress)విజయకేతనం ఎగురవేసింది. ఎగ్జిట్‌పోల్స్(exit polls) అంచనాలు కూడా తారుమారు చేస్తూ కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. మొత్తం 136స్థానాల్లో గెలిచి అధికారం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్జీని సాధించింది. ఈ నేపథ్యంలో ధార్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అనూహ్యరీతిలో గెలిచారు. ఇప్పుడు ఆయన కర్ణాటక పాలిటిక్స్ లో చర్చనీయాంశమైనాడు. ధార్వాడ రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే(MLA)గా గెలిచిన వినయ్ కులకర్ణి(Vinay Kulkarni) ఘనవిజయం సాధించారు. వినయ్ కులకర్ణి కనీసం నామినేషన్(Nomination) వేసేందుకు కూడా వెళ్లలేదు.. ఏ ఒక్కచోటా ఆయన కనీసం ప్రచారం చేయలేదు. అయిన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి అమృత్ అయ్యప్ప దేశాయ్‌పై 18 వేల 114 ఓట్ల తేడాతో గెలిచారు. వినయ్ కులకర్ణికి 88 వేల 660 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అమృత్ అయ్యప్ప దేశాయ్‌కు 70 వేల 546 ఓట్లు పడ్డాయి.
కాగా ధార్వాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్ కులకర్ణి(Vinay Kulkarni) ఆది నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వినయ్ కులకర్ణి కోర్టు ఉత్తర్వులతో నామినేషన్ పత్రాలు సమర్పించలేకపోయారు. ఒక్కరోజు కూడా తన నియోజకవర్గంలో క్యాంపెయిన్(campaigning) నిర్వహించలేదు.. అయినప్పటికీ వినయ్ కులకర్ణి భారీ మెజార్టీతో గెలిచారు. వినయ్ కులకర్ణి తరపున అతని కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేశారు. ధార్వాడ జిల్లా కలెక్టర్ యోగీష్ గౌడ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వినయ్ ధార్వాడ(Dharwad) జిల్లాలోకి ప్రవేశించకుండా కోర్టు నిషేధం విధించింది. అంతేకాదు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో వినయ్ కులకర్ణి సతీమణి శివలీల తన మద్దతుదారులతో కలిసి ప్రచారం చేశారు. కేవలం కులకర్ణి వీడియో, ఆడియో కాల్స్ ద్వారా ఓటర్లకు చేరువయ్యారు. అయితే సీఎం బసవరాజ్ బొమ్మై, సినీ నటుడు సుదీప్, బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఎమ్మెల్యే బసవగౌడ వంటి వారు తన అపోజిట్ అభ్యర్థి అమృత్ దేశాయ్ తరపున ప్రచారం చేశారు.. అయినప్పటికీ వినయ్ కులకర్ణి భారీ విజయాన్ని సాధించారు.