»If You Sleep Late At Night Thers More Risk Of Heart Disease
Heart disease : రాత్రి 11లోపే పడుకోవాలట.. లేకపోతే అంతే
12 గంటల వరకు మెలకువగా ఉండే వారికి గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. నిద్ర నమూనాలు, గుండె జబ్బుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పరిశోధన చూపించింది.
Heart disease : ఇటీవల కాలంలో గుండె జబ్బుల(Heart disease)తో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న వయస్సులోనే హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. అప్పటి దాకా సరదాగా గడిపిన వారంతా ఉన్నట్లుండి గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తున్నారు. చిన్న వయసులోనే కాలం చేస్తున్నారు. పెరుగుతున్న గుండెపోటు(Heart Attack) మరణాలపై ప్రస్తుతం అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక పరిశోధన ప్రకారం రాత్రిపూట సరైన సమయానికి నిద్రపోతే గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చని తేలింది. యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్(University of Exeter) పరిశోధనలో రాత్రి తొందరగా నిద్రపోయే వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువని రుజువైంది
12 గంటల వరకు మెలకువగా ఉండే వారికి గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. నిద్ర నమూనాలు, గుండె జబ్బుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పరిశోధన చూపించింది. ఇంగ్లండ్(England)లో 88 వేల మందిపై ఈ పరిశోధన చేశారు. ఈ అధ్యయనంలో ప్రజలు వారి నిద్ర(Sleep), నిద్రనుంచి మేల్కొనే సమయాల గురించి అడిగారు. దీనితో పాటు ఆహారం, జీవనశైలి(lifestyle)కి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా సేకరించారు.
వీరికి సంబంధించిన నాలుగేళ్ల వైద్య రికార్డుల(medical records)ను పరిశీలించారు. రాత్రి 11 గంటల లోపు నిద్రపోయే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని, ఈ సమయం తర్వాత పడుకునే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 35 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరం యొక్క సిర్కాడియన్ రిథమ్(circadian rhythm) దెబ్బతింటుందని పరిశోధనలో తేలింది. ఇది గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి 11 గంటలలోపు నిద్రపోవాలని పరిశోధకులు సూచించారు.
అమెరికన్ హార్ట్ జర్నల్ ప్రకారం, గుండె జబ్బులను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం కూడా చాలా ముఖ్యం. ఇందుకు సమయానికి నిద్రతో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం. మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై కూడా దృష్టి పెట్టాలి. జన్యుపరమైన కారణాల వల్ల చాలా మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు ఇంతకు ముందు చిన్నపాటి గుండెపోటు వచ్చినా మళ్లీ మళ్లీ ఈ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. చాలా మందికి గుండె జబ్బుల లక్షణాలు లేవు. దీన్నే సైలెంట్ హార్ట్ ఎటాక్(Silent Heart Attack) అంటారు.
గుండెజబ్బుల భారిన పడకుండా ఉండాలంటే.. ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వేయించిన, మసాలా మరియు వీధి ఆహారాలు తినడం మానుకోవాలి. ప్రతి మూడు నెలలకోసారి గుండెను వైద్యుడి చేత తనిఖీ చేయించుకోవాలి. మద్యపానం, ధూమపానాని(Smoke)కి దూరంగా ఉండాలి.