Fish Medicine: ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం (Fish Medicine) పంపిణీ ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేప మందు (Fish Medicine) పంపిణీ కోసం గ్రౌండ్లో 32 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఉన్నాయి. రేపు ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ జరగనుంది.
చేప ప్రసాద (Fish Medicine) పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గత 175 ఏళ్ల నుంచి బత్తిని కుటుంబ సభ్యులు ఆస్తామా రోగులకు చేప ప్రసాదం (Fish Medicine) పంపిణీ చేస్తున్నారని ఆయన వివరించారు. చేప ప్రసాదం కోసం క్యూ లైన్లలో రోగులు వేచి ఉన్నారు.చేప మందు (Fish Medicine) కోసం వచ్చే ప్రయాణీకుల సౌకర్యార్థం 9, 10వ తేదీలలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దాదాపు 50 బస్సులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో గల వివిధ ప్రాంతాల నుంచి 80 బస్సులను తిరుగుతున్నాయి.
చేప ప్రసాదం (Fish Medicine) వేసుకుంటే ఉబ్బస వ్యాధి నయం అవుతుందని ప్రజలు విశ్వసిస్తారు. ఏటా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం కోసం వస్తుంటారు. ఆ రెండు రోజులు విపరీతమైన రద్దీ ఉంటుంది. కరోనా వల్ల మూడేళ్లపాటు చేప ప్రసాద పంపిణీ జరగలేదనే సంగతి తెలిసిందే.