Fish Prasad: హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏటా ఉబ్బసం రోగులకు చేప మందు పంపిణీ చేసే బత్తిన కుటుంబం ఈ విషయమై వివరాలను వెల్లడించింది. జూన్ ఎనిమిదో తేదీన మృగశిర కార్తెలో ఈ చేప మందును(Fish medicine) పంపిణీ చేయనున్నామని తెలిపింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి లభించిందని తెలిపింది.
అందుకు తగినట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయని బత్తిన అనురీత్ గౌడ్, గౌరీ శంకర్ గౌడ్లు తెలిపారు. ప్రసాదం తయారీ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తోందని చెప్పారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రసాదం పంపిణీకి కావాల్సిన అన్ని అనుమతులూ వచ్చాయని చెప్పారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని అన్నారు.
తాము చేప మందు ప్రసాదం పంపిణీకి తయారీ మొదలు పెట్టాయమని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకు ముందుగా సత్యనారాయణ వ్రతం, ప్రత్యేకమైన భూమి పూజలు నిర్వహించామని తెలిపారు. ఆస్తమా(Astama) రోగం తగ్గుముఖం పడుతున్న నమ్మకంతో ఏటా వేలాది మంది ప్రజలు ఈ మందును స్వీకరించడానికి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం ఈ మందు కోసం వేలాది మంది వస్తుంటారు. దీంతో అందుకు తగినట్లుగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి.