ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సొంత రాష్ట్రం బీహార్లో తొలి ప్రయత్నంలోనే ఘోర పరాజయాన్ని చవిచూశారు. ‘చాయ్ పే చర్చా’ వంటి నినాదాలు, సోషల్ మీడియా వ్యూహాలు జన్ సూరాజ్ పార్టీకి పని చేయలేదు. అన్ని స్థానాల్లో పోటీ చేసినా కనీసం ఖాతా తెరవలేదు. 3.5% ఓట్లతో అనేకచోట్ల మూడో స్థానానికే పరిమితమైంది. రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తామన్న హామీని బీహారీలు పట్టించుకోలేదు.