TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగనుంది. ఈ అంశంపై నిన్న కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఫిరాయింపులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉందని.. పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు లాయర్లు పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయం తర్వాతే న్యాయసమీక్షకు అవకాశం ఉందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరారు.