AP: గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలనేది తమ లక్ష్యం అని హోం మంత్రి అనిత అన్నారు. ‘గంజాయి సాగు కనిపెట్టేందుకు డ్రోన్లు ఉపయోగిస్తున్నాం. డ్రగ్స్‌పై ప్రజలకు ఎంతో అవగాహన కల్పించాం. పిల్లల జీవితాలు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదే. గంజాయి బారినపడి ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.