AP: ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి సుభాష్ వెల్లడించారు. వైసీపీ హయాంలో విద్యుత్ రంగంలో రూ.5 వేల కోట్లు నష్టం వచ్చిందన్నారు. రైతులు, కార్మికులు, పేదలకు విద్యుత్ భారం తగ్గిస్తామని తెలిపారు. విద్యుత్ భారం తగ్గితే ఇళ్లు, పరిశ్రమలు, సాగు రంగాలకు మేలు కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.