TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఆరో రౌండ్లోనూ బీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 2,938 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఆరో రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 15,589 ఓట్లు నమోదయ్యాయి. వరుసగా ఐదు రౌండ్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. నవీన్ యాదవ్ గెలుపు దిశగా ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు.