TG: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో కీలక నిందితుడు భోగమోని సురేశ్ ఏ-1గా ఉండగా.. అతని కోసం గాలిస్తున్నారు. దాడిలో కలెక్టర్, అధికారులు, పోలీసులకు గాయాలైనట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అధికారులపై దాడి, హత్యాయత్నంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.