AP: ఆర్టీజీఎస్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఐటీ మంత్రి లోకేశ్ సమగ్ర డేటా అనుసంధానం ద్వారా మెరుగైన పౌరసేవలు అందించాలని అధికారులకు సూచించారు. అర్హులకే పథకాలు అందేలా ఆర్టీజీఎస్ ఉపయోగపడాలని తెలిపారు. పుట్టిన ప్రతి బిడ్డకూ ఆధార్ ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలని తెలిపారు. త్వరలో వాట్సప్ ద్వారా వంద పౌరసేవలు అందిస్తామని పేర్కొన్నారు.