ఢిల్లీ పేలుడు వెనుక కుట్రదారులకు ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. పేలుడు కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వారిని చట్టం ముందు నిలబెడతామని వెల్లడించారు. ఢిల్లీలోని LNJP ఆసుపత్రిలో బాంబు దాడి బాధితులను పరామర్శించిన తర్వాత ఉగ్రవాదులను హెచ్చరించారు. అనంతరం బాధితులకు జరుగుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.