మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు మచిలీపట్నంలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించారట. ఈ విషయంపై నిరసన చేపట్టగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్ల విలువగల భూమిని పార్టీ ఆఫీసుకు ఎలా కేటాయిస్తారని ఆందోళనకు దిగారు. ఆ భూమిని మీడియా ప్రతినిధులకు చూపించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడినుంచి రవీంద్రను తరలించడాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసులతో వాగ్వాదం జరిగింది. అక్కడే వాదనకు దిగగా లక్ష్మీ టాకీస్ సెంటర్ వద్ద ట్రాపిక్ నిలిచిపోయింది. రవీంద్రను అక్కడినుంచి బలవంతంగా తరలించారు. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.