AP: YCP ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అసభ్య పోస్టుల వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయిన ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు రాఘవరెడ్డి కోసం పులివెందుల, లింగాల మండలాల్లో గాలిస్తున్నారు. అవినాష్ పీఏ స్వగ్రామం అంబకపల్లెలో పోలీసులు నిఘా పెట్టారు. మరోవైపు పులివెందులలో నమోదైన అట్రాసిటీ కేసులో అనుమానితుల కోసం గాలింపు కొనసాగుతోంది.