AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో.. నిన్న కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ స్థానంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం వైసీపీ నేత వర్రా రవీందర్ రెడ్డి కేసుపై పోలీసు అధికారులతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆయన కోసం నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.