వెనిజులాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రాజధాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలోని కాల్పుల శబ్దాలు వినిపించడం చర్చనీయాశంగా మారింది. మిరోఫ్లోర్స్ ప్యాలెస్‌పై డ్రోన్లు ఎగరడాన్ని అక్కడి భద్రతా దళాలు గుర్తించి వాటిపై కాల్పులు జరిపాయి. కాగా, వెనిజులాలో ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదని అమెరికా క్లారిటీ ఇచ్చింది.