AP: గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో రూ.505కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 400/220కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (GIS)ని మొదలుపెట్టారు. కాగా.. ఇది రాష్ట్రంలో తొలి GIS ఉపకేంద్రం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలు విద్యుత్ ప్రాజెక్టులకు సీఎం ఆన్లైన్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.