సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడు రోజుల నియోజకవర్గ పర్యటన ఇవాళ ప్రారంభమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన భాగేపల్లి టోల్గేట్ వద్దకు చేరుకోగా, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.