TG: UPSCలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం ద్వారా ఆర్థిక సాయం అందిపుచ్చుకొని ఒకే దఫా 20 మంది పేద బిడ్డలు ఉత్తీర్ణత సాధించడం తెలంగాణకు గర్వకారణమన్నారు. వీరితో పాటు విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు.