TG: బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణ నేటితో ముగిసింది. వివిధ కుల సంఘాల నుంచి వినతులను అఫిడవిట్ రూపంలో స్వీకరించారు. బీసీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించారు. బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరిగిన హియరింగ్లో మొత్తం 1336 వినతులు వచ్చాయన్నారు. వీటిపై త్వరలోనే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తామన్నారు.