TG: రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వారంతా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లోని తన కార్యాలయంలో కలిసేందుకు పార్టీ నేతలకు ప్రధాని మోదీ సమయం ఇచ్చినట్లు సీఎంవో వెల్లడించింది. తమ నియోజకవర్గాల సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.