TG: ఖమ్మం జిల్లా నారపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ స్కూల్లో ఒకే ఒక్క విద్యార్థి ఉండగా..ఏడాదికి రూ.12.84 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని కీర్తన కోసం ప్రభుత్వం ఒక టీచర్‌ను నియమించింది. టీచర్‌కు నెలవారీ జీతం రూ.1,01,167, మధ్యాహ్న భోజనం నిమిత్తం వంట మనిషికి నెలకు రూ.3000, స్కూల్ మెయింటైన్ గ్రాండ్.. అన్నీ కలిపి సుమారు రూ.12.84 లక్షల ఖర్చు అవుతోంది.