AP: తిరుపతి జిల్లా శ్రీసిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. నూతన పారిశ్రామిక విధానం 4.0 మేరకు ఎల్జీ ఉపకరణాల ఉత్పత్తి ప్లాంట్‌కు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, కంప్రెసర్ల ఉత్పత్తికి ఎల్జీ సంస్థ యూనిట్‌ను ప్రారంభించనుంది. రూ.5 వేల కోట్ల పెట్టుబడులు ఎల్జీ పెడుతుందని ప్రభుత్వం పేర్కొంది.