పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన ఆందోళనలు ఉధృతంగా మారాయి. ఇస్లామాబాద్‌లో భారీ స్థాయిలో భద్రతా దళాలు అడ్డుకున్నప్పటికీ నగరం నడిబొడ్డు డీచౌక్కు ఆందోళనకారులు చేరుకున్నారు. ఈ ఆందోళనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. 100 మంది గాయపడినట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.