TG: రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర పన్నుతుందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగం అమలుకు అడ్డంకులు ఏర్పడటం బాధాకరమన్నారు. పదేళ్లుగా బీజేపీ కుట్రలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చేస్తున్న ప్రయత్నంలో బీఆర్ఎస్ సహకరిస్తూ వస్తుందన్నారు. అందుకే తెలంగాణలో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని ఆరోపించారు.