ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన(యూబీటీ) భారీ ఓటమిని చవిచూసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 స్థానాలకే పరిమితం అయింది. ఈ క్రమంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ముంబైలోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశమై ఫలితాలను సమీక్షించారు. ఎన్నికల్లో ఓడిపోయిన కొంతమంది అభ్యర్థులు ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేసినట్లు చెప్పారు. పార్టీపై ఆశలు వదులుకోవద్దని, పార్టీ పునర్నిర్మాణానికి కృషి చేయాలని నేతలకు ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేశారు.