TG: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ నాయకులను పార్టీ మారాలని చెబుతున్నారట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సన్నాసిని కలెక్టర్గా తీసుకొచ్చారంటూ ఫైర్ అయ్యారు. వీళ్లు బీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని, అతి చేస్తున్న కలెక్టర్లు, అధికారులు రాసిపెట్టుకోవాలన్నారు.