ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పులు విరమించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ కేబినెట్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్-లెబనాన్ కేంద్రంగా దాడులకు పాల్పడుతున్న హెజ్బొల్లా మధ్య కాల్పులను ఆపేందుకు US, యూరప్ దేశాలు ఐరాస ప్రయత్నిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అంశాన్ని ఇవాళ అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు ప్రకటించే అవకాశం ఉంది.