జపాన్‌లోని షికోకు బ్యాంకు.. ఉద్యోగులకు వింత నిబంధన పెట్టింది. తమ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడినా, నిధులు దుర్వినియోగం చేస్తే వారు ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరే ముందే ఈ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. అయితే, సంతకం ఉద్యోగి రక్తంతో చేయాలని రూల్స్ పెట్టింది. ఎంప్లాయిస్ బ్యాంకులో డబ్బు చోరీ చేస్తే తిరిగి చెల్లించాలి.. అనంతరం సూసైడ్ చేసుకోవాలని వెబ్ సైట్లో పేర్కొంది.