PDPL: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన వివరాల మేరకు.. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన కుమార్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. చికిత్సకు డబ్బులు లేక చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఈ నెల 20న పురుగుమందు తాగారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.