గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ దౌత్యాధికారిని రష్యా బహిష్కరించింది. తప్పుడు వ్యక్తిగత వివరాలు ఇచ్చి రష్యాలోకి ప్రవేశించినట్లు ఆరోపించింది. దౌత్యాధికారి ముసుగులో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసినట్లు గుర్తించినట్లు వెల్లడించింది. రెండు వారాల్లో దేశం విడిచి వెళ్లాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.