క్వాంటమ్ అనే ఓ ప్రత్యేక రకమైన కంప్యూటర్ చిప్‌ను గూగుల్ ఆవిష్కరించింది. క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించేందుకు రూపొందించింది. సాధారణ చిప్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇది ఎంతటి క్లిష్టతరమైన గణాంక సమస్యలనైనా కేవలం 5 నిమిషాల్లోనే పరిష్కరిస్తోంది. కాగా, ఇదే పనిని ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లు చేయాలంటే మాత్రం విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువ సంవత్సరాలు పడుతుందట.