AP: మచిలీపట్నం పీఎస్లో సీఐతో జరిగిన వాగ్వాదంపై మాజీమంత్రి పేర్నినాని వివరణ ఇచ్చారు. ‘సీఐ ఏసుబాబు విధులకు నేను ఆటంకం కలిగించలేదు. సుబన్నను వదిలిపెట్టమని అడగలేదు, తీసుకెళ్తానని చెప్పలేదు. పెళ్లీ పీటలమీద కూర్చోవాల్సి ఉండటంతో త్వరగా రిమాండ్ పెట్టమని అడిగాను. మా మేయర్ భర్తపై సీఐ రెచ్చగొట్టేలా మాట జారాడు. కేసు పెడితే అరెస్ట్ అవుతాం, బెయిల్ తీసుకొచ్చుకుంటాం’ అని అన్నారు.