WGL: నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ క్రమంలో శనివారం ఉదయం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి ఆయన్ను పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లి కాంతమ్మ చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులను కలిసి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.